Sammathame Tickets: మరికొన్ని గంటల్లో 'స‌మ్మ‌త‌మే' సినిమా రిలీజ్.. కామెంట్ చేసి ఫ్రీగా టికెట్ పొందండి!

Kiran Abbavaram to give Free Tickets For Sammathame Movie. మ్యూజికల్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన స‌మ్మ‌త‌మే సినిమా శుక్రవారం గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది. కామెంట్ చేసి ఫ్రీగా సినిమా టికెట్ పొందండి.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 23, 2022, 11:57 PM IST
  • మరికొన్ని గంటల్లో 'స‌మ్మ‌త‌మే' సినిమా రిలీజ్
  • కామెంట్ చేసి ఫ్రీగా సినిమా టికెట్ పొందండి
  • సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి
Sammathame Tickets: మరికొన్ని గంటల్లో 'స‌మ్మ‌త‌మే' సినిమా రిలీజ్.. కామెంట్ చేసి ఫ్రీగా టికెట్ పొందండి!

Kiran Abbavaram to give Free Tickets For Sammathame Movie: 'ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం ఇటీవల 'సెబాస్టియన్ పీసీ 524' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు 'స‌మ్మ‌త‌మే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గోపీనాథ్ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను యు.జి ప్రొడక్షన్స్‌ సంస్థపై కంకణాల ప్రవీణ్‌ నిర్మించారు. 

మ్యూజికల్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన స‌మ్మ‌త‌మే సినిమా శుక్రవారం (జూన్ 24) గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టిక్కెట్లపై అభిమానులకు పలు అనుమానాలు ఉన్నాయి. ఇంతకీ సినిమా టికెట్ రేట్లు పెంచారా? లేదా యథావిధిగా ఉన్నాయా అనే అయోమయంలో ఉన్నారు. ఈ విషయంపై కిరణ్‌ అబ్బవరంను కొందరు ఫాన్స్ ప్రశ్నించగా.. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఈ వీడియోకి కామెంట్ సెక్షన్లో వివరాలు చేసి ఉచితముగా టికెట్ పొందొచ్చు. 

కిరణ్‌ అబ్బవరం ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో మాట్లాడుతూ... 'ప్రతి ఒక్కరికి నమస్కారం. ప్రొమోషన్లో భాగంగా స‌మ్మ‌త‌మే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రేపు స‌మ్మ‌త‌మే సినిమా రిలీజ్ అవుతోంది. ప్రతిఒక్కరు థియేటర్లలో సినిమా చూడండి. టిక్కెట్ ధరపై అదీఇదీ మాట్లాడుకుంటున్నారు. నాకు తెలిసి నార్మల్ ప్రెస్సెస్ ఉన్నాయి. టిక్కెట్ ధర ఎక్కువగా ఉందనుకున్న వారికి మొదటి షోకి నేనే టికెట్ ఇప్పిస్తా. మీ పేరు, మొబైల్ నంబర్, దగ్గరలోని థియేటర్ వివరాలు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఉదయం వరకు మీకు టికెట్ అందేలా ప్రయత్నిస్తా. సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి' అని అన్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అయింది. 

సెన్సార్ యూనిట్ స‌మ్మ‌త‌మే చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం సరసన తెలుగందం చాందినీ చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫ‌న్ అండ్ సీరియ‌స్ కథతో సాగే ఎంట‌ర్ టైనింగ్ ల‌వ్ స్టోరీగా తెరకెక్కింది. ఇటీవలే విడుదల అయిన ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంది. ట్రైల‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి.

Also Read: Rohit Sharma Debut: 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ పూర్తి.. ఎమోషనల్‌ అయిన రోహిత్‌ శర్మ!

Also Read: Green Fennel Benefits: పచ్చి సోంపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News